పురుగుల మందుతాగి బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య

-

Adilabad | పురుగుల మందుతాగి బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బానోతు సురేష్‌ (35) అనే వ్యక్తి బ్యాంక్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య ప్రియాంకతో బ్యాంకు సమీపంలో ఓ ఇంట్లో నివాసం ఉండేవాడు. ఆగస్టు 17వ తేదీన విధులు పూర్తయ్యాక రాత్రి 7.30 గంటల సమయంలో బ్యాంకులోని తన క్యాబిన్‌లో ముందుగా తెచ్చుకున్న పురుగుమందు తాగాడు.

- Advertisement -

Adilabad |అనంతరం వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన బ్యాంకు సిబ్బంది వెంటనే ఆసిఫాబాద్‌లో ఉంటున్న భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ఆసిఫాబాద్‌(Asifabad) ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: మరో అడుగు దూరంలో.. చంద్రుడిపై అద్భుతమైన ఫొటోలు పంపిన ల్యాండర్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...