తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్(Pro Tem Speaker)గా ఎవరు వ్యవహరిస్తారనే చర్చ జోరుగా జరిగింది. ఇప్పుడు ఈ చర్చకు ముగింపు పడింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi)ని ప్రొటెం స్పీకర్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో శనివారం ఉదయం 8.30గంటలకు ప్రొటెం స్పీకర్‌గా ఆయన చేత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం చేయిస్తారు. తదుపరి అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ఆయన ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వాస్తవంగా ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రొటెం స్పీకర్‌గా వ్యవహిరంచాల్సి ఉంటుంది. కానీ ఆయన బాత్రూంలో కాలు జారి ఆసుపత్రిలో చేరడంతో అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi)ని ప్రభుత్వం నియమించింది. అక్బరుద్దీన్ ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.