హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి.. ఆ విషయంలో రాజీ ప్రసక్తే లేదన్న అమిత్ షా

-

Amit shah participates in passing out parade of 74 IPS Batch in Hyderabad: హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీలో IPS 74వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైనీ IPSల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం తమకు అప్పగించిన బాధ్యతను ప్రతి IPS గుర్తుంచుకోవాలన్నారు.

- Advertisement -

తమ విధి నిర్వహణలో ఒత్తిళ్లకు తలొగ్గకుండా ముందుకు సాగాలని IPS లకు అమిత్ పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం కశ్మీర్లో ఉగ్రవాదం సహా ఎన్నో సమస్యలతో దేశ అంతర్గత భద్రత విషయంలో ఆందోళన ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు గవర్నర్ తమిళి సై కూడా పాల్గొన్నారు. ప్రస్తుత బ్యాచ్ లో 195 మంది శిక్షణ పొందగా వీరిలో 41 మంది మహిళలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...