Amit Shah | RRR సినిమా టీంతో అమిత్ షా రద్దు

-

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన శంషాబాద్‌కు చేరుకుంటారు. ఈ మేరకు మార్పులకు సంబంధించి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. కర్ణాటక ఎన్నికలు, ఇతర ముఖ్య కార్యక్రమాలు ఉండడంతో ఆలస్యంగా అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. షా షెడ్యూల్ ఆలస్యం కారణంగా తొలుత పేర్కొన్న కార్యక్రమాలు పూర్తిగా రద్దయ్యాయి. తొలుత ట్రిపుల్ ఆర్ టీమ్ తో అమిత్ షా భేటీ అవుతారని చెప్పినా ఆలస్యంగా వస్తుండటంతో రద్దయింది.

- Advertisement -

అంతేకాకుండా నొవాటెల్ లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం సైతం రద్దయినట్లుగా సమాచారం. అంతేకాకుండా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన నేతలతో భేటీ కూడా ఉండకపోవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా సభకు మాత్రం అనుకున్న సమయానికి అమిత్ షా హాజరుకానున్నారు. ఆదివారం సాయంత్ర 5 గంటలకు శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభ(Vijaya Sankalpa Sabha) ప్రాంగణానికి షా(Amit Shah) చేరుకుంటారు.

Read Also: ప్రధానిపై ఆత్మాహుతి దాడి చేస్తాం.. బీజేపీ కార్యాలయానికి బెదిరింపు లేఖ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...