MLA రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

-

గోషామహల్‌ బీజేపీ బహిషృత ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ షాహినాత్‌ గంజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ బుక్ అయింది.

- Advertisement -

శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎస్ఐ ఫిర్యాదు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా తన కొడుకుని పరిచయం చేస్తూ.. ఇతర కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. దీంతో రాజాసింగ్‌పై 153-A, 506 IPC సెక్షన్స్‌ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌లో రాజా సింగ్‌పై కేసు నమోదై ఉన్న విషయం తెలిసిందే. కాగా.. కేసుల నమోదును రాజాసింగ్‌ తప్పుబట్టారు. శ్రీరామనవమి శోభాయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పష్టం చేశారు. కొట్టేసిన PD యాక్ట్‌ తిరిగి తెరిచి తనను మళ్లీ జైలుకు పంపే కుట్ర జరుగుతోందని రాజాసింగ్‌ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...