Revanth Reddy | కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం..

-

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కాసేపట్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ఇప్పటికే ప్రజలకు రేవంత్ బహిరం లేఖ ద్వారా ఆహ్వానం పంపించారు. ఇవాళ మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. సీఎం హోదాలో ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక(Priyanka Gandhi), పలు రాష్ట్రాల కీలక నేతలు ముఖ్య అతిథులుగా రానున్నారు. దీంతో ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు.

- Advertisement -

స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఇలా..

ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు

ఆత్మీయ అతిధులుగా తెలంగాణ ఉద్యమకారులు

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపిన కాంగ్రెస్

స్టేడియంలో మూడు వేదికల ఏర్పాటు

ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం

లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక

రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో మరో వేదిక

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు

గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్(Revanth Reddy) కి స్వాగతం

వేదిక కింద అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ

తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ

30 వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు

స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు

Read Also: తెలంగాణ మంత్రుల జాబితాలో 11 మందికి చోటు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

BJP MP Candidates | తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. మల్కాజిగిరి నుంచి ఎవరంటే..?

BJP MP Candidates | లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల...

Mukesh Ambani | కన్నీళ్లు పెట్టుకున్న అపర కుబేరుడు.. ఎంతైనా తండ్రి కదా..

అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్, రాధికా మర్చంట్‌ల...