Pragathi Bhavan | ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత.. బ్యారికేడ్లు తొలగింపు..

-

హైదరాబాద్‌లోని ప్రగతిభవన్(Pragathi Bhavan) వద్ద ట్రాఫిక్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు పోలీసులు. ప్రగతిభవన్ ముందున్న రోడ్డుపై ఉన్న బ్యారికేడ్లు, గ్రిల్స్‌ని పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. అంతేకాకుండా ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు. రెండు రోజుల్లో బ్యారికేడ్లను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ప్రగతి భవన్ పేరును అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేస్తూ బ్యారికేడ్లను పోలీసులు తొలగించారు.

- Advertisement -

Read Also: కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...