తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు బాగున్నాయని ఆస్ట్రేలియా హై కమిషనర్(Australia High Commission) ఫిలిప్ గ్రీన్ ప్రశంసించారు. అందులోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం అనేది మంచి ఆలోచన అని కొనియాడారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వీ హబ్(We Hub) లో కీలక భేటీ జరిగింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో ఆస్ట్రేలియా హై కమిషనర్, బెంగళూరు కాన్సులేట్ జనరల్ హిల్లరీ మెక్ గెచీ సమావేశమయ్యారు. భేటీలో భాగంగా వీహబ్ తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలో వ్యాపార అవకాశాలపై ఆస్ట్రేలియా బృందంతో మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) చర్చించారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అనువైన వాతావరణం పై వారికి వివరించారు. యువతలో నైపుణ్యం పెంపొందించడానికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులపై ముచ్చటించారు. వ్యవసాయ క్లస్టర్ల గురించి ఆస్ట్రేలియా బృందంతో మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు.