Bandi Sanjay Accuses CM KCR over Rajashyamala Yagam in delhi: తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అరిగోస పడుతుంటే.. కేసీఆర్ ఏ యాగం చేసినా ఫలితం లభించదని అన్నారు. ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ సమయంలో కేసీఆర్ చేయనున్న ‘రాజశ్యామల’ యాగానికి తాము వ్యతిరేకం కాదని.. కేసీఆర్ స్వార్థం కోసమే యాగం చేస్తున్నట్లు విమర్శించారు. యాగం చేసే సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసులో తన కుమార్తె కవితకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ చేసే తప్పులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని.. ఎన్ని యాగాలు చేసినా దేవుడు కూడా క్షమించడని బండి సంజయ్ అన్నారు.
Read Also: ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం.. ప్రారంభ పనుల్లో మునిగిన నేతలు