తెలంగాణ కాంగ్రెస్‌కు కేసీఆర్ వెయ్యి కోట్ల సాయం

-

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించిన బండి సంజయ్‌ కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం స్వయంగా సీఎం కేసీఆరే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను తయారు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్(BRS) వీక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు గులాబీ దళం సహకరిస్తుందని, గెలిచాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కేసీఆరే కాంగ్రెస్‌ను లేపుతున్నారని అన్నారు.
ఈ విషయం తెలిసినా కొందరు కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారని తెలిపారు. అంతేగాక, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్ సాయం చేయబోతున్నారని, ఇప్పటికే రూ.వెయ్యికోట్లు ఇచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీజేపీ(BJP) ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. అనంతరం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం(Delhi Liquor Scam) వ్యవహారంపై స్పందిస్తూ.. సరైన సమయంలో ఎమ్మెల్సీ కవితపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కవిత తప్పు చేయలేదని కేసీఆర్(KCR), కేటీఆర్‌(KTR)లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తప్పు చేసిన ప్రతీ ఒక్కరూ శిక్షార్హులే అని, కేసీఆర్‌ కుటుంబం జైలుకెళ్లడాన్ని ఎవరూ ఆపలేరని బండి(Bandi Sanjay) అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...