ఏలేటి బీజేపీలో చేరడంపై బండి సంజయ్ రియాక్షన్

-

Bandi Sanjay |కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)కు పంపించారు. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై ఏలేటి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు.

- Advertisement -

ఏలేటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్(Tarun Chugh) ని కలిశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender), ఇతర నేతలతో కలిసి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా(JP Nadda)ను కలిసి, ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.

కాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడంపై బండి సంజయ్(Bandi Sanjay) హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై నమ్మకంతో ఏలేటి బీజేపీలో చేరారన్నారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్.. ఆయనను పార్టీలోకి స్వాగతించడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడతామని, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రజలకు చేరేలా కలిసి శ్రమిస్తామని బండి సంజయ్ తెలిపారు.

Read Also: రాహుల్ గాంధీపై బీజేపీ భారీ కుట్ర: రేవంత్ రెడ్డి
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...