Bandi Sanjay Praja Sangrama Padayatra be held: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేడు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఈ పాదయాత్రకు అనుమతి ఇచ్చేందుకు నిర్మల్ పోలీసులు నిరకరించారు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి భైంసా వెళ్తున్న బండి సంజయ్‌ను కోరుట్ల సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో సోమవరం భైంసాకు వెళ్లి తీరుతా అని ఆదివారం శపథం చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి పరిస్థితులో ఈరోజు పాదయాత్ర సాగుతుందా..? ఆగుతుందా..? అనే అంశం రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతోంది. ఈ పరిస్థితులో బండి సంజయ్ పోలీసుల నుంచి తప్పించుకొని భైంసాకు చేరుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.