కవిత బెయిల్‌పై కాంగ్రెస్‌కు కంగ్రాట్స్.. బండి సంజయ్ సెటైర్లు

-

కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బెయిల్ వచ్చిన విషయంపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ చెప్పారు. ఎట్టకేలకు కాంగ్రెస్ కృషి ఫలించిందంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. కవితకు బెయిల్ రావడం అనేది ఎవరో ఒకరి విజయమో కాదంటూ రాసుకొచ్చారు. ఆయన పోస్ట్‌పై ఇటు బీఆర్ఎస్(BRS), అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ కుట్ర పూరిత రాజకీయాల వల్లే అసలు కవిత జైలుకు వెళ్లారని, తమను కాదన్న వారిపై కేసులు పెట్టి భయపెట్టడం బీజేపీకి బాగా అలవాటైపోయిందంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

- Advertisement -

‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్‌(Delhi Liquor Scam)లో కవితకు బెయిల్ సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, వారి అడ్వకేట్స్‌కు ధన్యవాదాలు. మీరు పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈ బెయిల్ మంజూరు కావడం అనేది బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు విజయమే. బీఆర్ఎస్ నేత బెయిల్‌పై బయటకు వచ్చేశారు కాబట్టి ఇక రాజ్యసభ సీటు కాంగ్రెస్ నేతకు దక్కుతుంది. కవితకు బెయిల్‌పై మొదల వివాదం సృష్టించిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎదురులేకుండా రాజ్యసభకు ఎంపిక చేయడానికి మద్దతు పలకడం ద్వారా కేసీఆర్ తన రాజకీయ చతురతను చూపుకున్నారు. ఏది ఏమైనా విజయం సాధించిన తోడు దొంగలకు అభినందనలు’’ అంటూ బండి సంజయ్(Bandi Sanjay) పోస్ట్ పెట్టారు.

Bandi Sanjay

Read Also: కవితకు రెండు కేసుల్లో బెయిల్.. కోర్టు ఏమందంటే..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...