బీజేపీ నేతలపై తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తూ బీజేపీ(BJP) పేపర్ లీకేజీలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు పేపర్ లీకేజీ కాలేదని గుర్తుచేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉపాధ్యాయ సంఘాలతో కుమ్మక్కై తెలుగు పేపర్‌ను లీక్ చేశారని మండిపడ్డారు. బీజేపీ బొక్కలకు కొంతమంది ఆశ పడుతున్నారని సీరియస్ అయ్యారు. బూర ప్రశాంత్(Boora Prashanth)తో కలిసి బండి సంజయ్(Bandi Sanjay) పేపర్ లీకేజీకి పాల్పడ్డారని తెలిపారు. మహేష్‌తో కలిసి బూర ప్రశాంత్ పేపర్ లీక్ చేశారని వ్యాఖ్యానించారు. తనను పోలీసులు కొట్టారని బండి సంజయ్ అబద్దాలు చెప్పారని ఎద్దేవా చేశారు.
పేపర్ లీకేజీ అయిందని బండి సంజయ్ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) జడ్జీలపై ఏం మాట్లాడారో అందరికీ తెలుసని అన్నారు. బీజేపీ లీగల్ టీమ్ బండి సంజయ్ బెయిల్ కోసం బెదిరించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఈటల రాజేందర్(Eatala Rajender) సూక్తులు చెప్తున్నారని మండిపడ్డారు. పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కానప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని బండి సంజయ్ ఎలా అన్నారని ప్రశ్నించారు. తెలంగాణను మతం, కులం పేరుతో వేరు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని పల్లా(Palla Rajeshwar Reddy) అన్నారు. బండి సంజయ్ రాజకీయాలకు పనికిరారని అన్నారు.కేసీఆర్(KCR) పాలనను చూసి ఓర్వలేక ప్రశ్నాపత్రాల లీకేజీ ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని అన్నారు.
Read Also: మా ముఖ్యమంత్రి చాలా సింపుల్‌గా ఉంటారు: మంత్రి తలసాని
Follow us on: Google News, Koo, Twitter