Bandi Sanjay |బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగించడంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్‌కు చివరి మేకు దింపుతున్నామని సెటైర్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బీజేపీ ఆధ్వర్యంలో వీధి సభలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తో కేసీఆర్ పాలనకు చివరి మేకు దింపుతున్నట్లు ఎద్దేవా చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయే కొనసాగుతారని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు 2024లో ఉన్నాయి. కాగా అప్పటి వరకు అధ్యక్షుడిని మార్చే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టంచేశారు. బండి సంజయ్(Bandi Sanjay) నాయకత్వంలో పార్టీ అద్భుతంగా అభివృద్ధి చెందిందని అన్నారు. బండి సంజయ్ లాంటి నాయకులు ఇప్పుడు పార్టీకి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.