హైదరాబాద్‌లోని ప్రగతిభవన్(Pragathi Bhavan) వద్ద ట్రాఫిక్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు పోలీసులు. ప్రగతిభవన్ ముందున్న రోడ్డుపై ఉన్న బ్యారికేడ్లు, గ్రిల్స్‌ని పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. అంతేకాకుండా ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు. రెండు రోజుల్లో బ్యారికేడ్లను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ప్రగతి భవన్ పేరును అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేస్తూ బ్యారికేడ్లను పోలీసులు తొలగించారు.
PragathiBhavan becoming Ambedkar PrajaBhavan
ప్రగతిభవన్… అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుతోంది.
ప్రగతి భవన్ ముందు రోడ్ పై ఉన్న షెడ్, గ్రిల్స్ ని తొలగిస్తున్న GHMC సిబ్బంది.GHMC staff removing the shed and grills on the road in front of Pragati Bhavan.#TelanganaCM #RevanthReddy… pic.twitter.com/GtwQxc9h2u
— Congress for Telangana (@Congress4TS) December 7, 2023