సీఎం కేసీఆర్‌పై CLP లీడర్ భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీపుల్స్ మార్చ్ జోడో యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిలో లక్షా 20 వేల ఉద్యోగులున్న వారి సంఖ్యను 40 వేలకు తీసుకువచ్చారని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని అనుకున్న నిరుద్యోగులను సీఎం కేసీఆర్ నిండా ముంచారన్నారు.

- Advertisement -

ఉద్యోగాల పేరుతో సీఎం దోపిడీ రాజ్యం నడిపిస్తున్నారని నిప్పులు చెరిగారు. సింగరేణిలో ప్రైవేటీకరణకు కేసీఆర్ సర్కార్ వేగం పెంచిందని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు. ఓపెన్ కాస్ట్‌లకు వ్యతిరేకం అంటూనే.. గోదావరిఖని నగరం నడిబొడ్డున ఓపెన్ కాస్ట్ ప్రారంభించారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలకు అక్రమ దందాలపై ఉన్న శ్రద్ద అభివృద్ధి మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...