మరో రెండు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను(Lok Sabha Polls) బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులోనూ తనకు పట్టు ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని 17 నియోజకర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Lok Sabha Polls | నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్‌లు వీరే..
అదిలాబాద్ – పాయక్ శంకర్ (ఎమ్మెల్యే)
పెద్దపల్లి – రామారావు పవార్ (ఎమ్మెల్యే)
కరీంనగర్ – ధనపాల్ సూర్యనారాయణ గుప్తా (ఎమ్మెల్యే)
నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి (ఎమ్మెల్యే)
జహీరాబాద్ – కాటేపల్లి వెంకటరమణ రెడ్డి (ఎమ్మెల్యే)
మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు (ఎమ్మెల్యే)
మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్యే)
సికింద్రాబాద్ – కె. లక్ష్మణ్ (ఎంపీ)
హైదరాబాద్ – రాజాసింగ్ (ఎమ్మెల్యే)
చేవెళ్ల – ఏవీఎన్ రెడ్డి (ఎమ్మెల్సీ)
మహబూబ్ నగర్ – రామచంద్రరావు (మాజీ ఎమ్మెల్సీ)
నాగర్ కర్నూల్ – మాగం రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
నల్గొండ – చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి (మాజీ మంత్రి)
మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు (మాజీ ఎంపీ)
ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
Read Also: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు