Kamareddy | తెలంగాణలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ముందు నుండి ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ వైపు ఎడ్జ్ కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో 53 స్థానాల్లో కాంగ్రెస్, 24 స్థానాల్లో బీఆర్ఎస్, 6 స్థానాల్లో బీజేపీ, 1 స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా, కామారెడ్డి(Kamareddy)లో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్(KCR), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికీ జలకిస్తూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి ముందంజలో ఉన్నారు. కేసీఆర్ తన సొంత ఇలాకా గజ్వేల్ లోనే కాకుండా కామారెడ్డి లో కూడా పోటీ చేస్తాననడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇక అదే నియోజకవర్గ నుంచి రేవంత్ రెడ్డి కూడా పోటీ చేయడంతో అందరి దృష్టి కామారెడ్డి నియోజకవర్గం వైపే మళ్ళింది. కామారెడ్డి లో కింగ్ మేకర్ ఎవరు అవుతారు అనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.