రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ.. బీజేపీ వైపు నిలిచిన టీచర్స్

-

AVN Reddy |ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ – హైదరాబాద్- రంగా రెడ్డి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపొందారు. PRTU అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి పై 1,150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో మార్చి 16 న ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మార్చి 17న ఉదయం 4:30 గంటలకు పూర్తయినట్లు తెలిసింది. ఏవిఎన్ రెడ్డి(AVN Reddy) గెలుపుతో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేయుకుంటున్నారు. మూడవ స్థానంలో నిలిచిన UTF  అభ్యర్థి పాపన్న గారి మాణిక్ రెడ్డి కి 6,079 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన BRS పార్టీ. ప్రభుత్వం టీచర్స్ సమస్యలను పాటించుకోకపోవడం వల్లే ఓటమిని చూడాల్సివచ్చిందని.. 317 జీఓ ప్రభావం ఈ ఎన్నికలపై చూపినట్లు తెలుస్తుంది.

- Advertisement -
Read Also: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌లో భారీ అగ్నిప్రమాదం

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...

YS Jagan | నారావారి పాలనను అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..?

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు...