సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌లో భారీ అగ్నిప్రమాదం

-

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్(Swapnalok Secunderabad) కాంప్లెక్స్ బిల్డింగ్‌లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ 7, 8 అంతస్థుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన దుకాణాదారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బిల్డింగ్ లోపల పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాంప్లెక్స్ లోపల పలు వాణిజ్య సముదాయాలు ఉండటంతో, పదుల సంఖ్యలో సిబ్బంది లోపలే చిక్కుకున్నట్లు సమాచారం. లోపల చిక్కుకున్న వారికి వారి కుటుంబసభ్యులతో పోలీసులు ఫోన్లు చేయిస్తున్నారు. మంటలు భారీగా ఎగిసి పడుతుంటంతో పొగ కమ్ముకొని బాధితులు లోపల ఉక్కిరికిబిక్కిరి అవుతున్నారు. కాంప్లెక్స్ పరిసరాల్లో కూడా దట్టంగా పొగలు అలుముకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
Read Also: రాజమౌళి-మహేశ్ బాబు సినిమా అంచనాలకు మించి ఉండబోతోంది

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...