రాజమౌళి-మహేశ్ బాబు సినిమా అంచనాలకు మించి ఉండబోతోంది: విజయేంద్ర ప్రసాద్

0
Rajamouli Mahesh Babu

Rajamouli Mahesh Babu |దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా విడుదలై దాదాపు ఏడాది గడిచినా ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో రాజమౌళి ఆనందానికి అవధులు లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే ఉత్సాహంతో మహేశ్ బాబుతో చేయబోయే తదుపరి సినిమా పనులు ప్రారంభించినట్లు సమాచారం. తాజాగా.. మహేశ్ బాబు-రాజమౌళి(Rajamouli Mahesh Babu) కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి ఈ సినిమాని అందరి అంచనాలు మించేలా ప్లాన్ చేస్తున్నారని.. ఈ మూవీలో మెసేజ్‌లు వంటివి ఏమి ఉండవని, సినిమా జనరంజకంగా ఉంటూ.. ఇంటిల్లిపాది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే మూవీగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈసారి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌లో ఒకటి కాదు.. పది, పదిహేను నామినేషన్‌లు వచ్చేలా ప్లాన్ చేయాలని రాజమౌళి చూస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Read Also: చాణక్య నీతి: ఆ విషయంలో పురుషులకంటే స్త్రీలకే కోరిక ఎక్కువ

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here