తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్రెడ్డిపై ఈడీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని అన్నారు. మంత్రి సూటిగా కాకుండా అనేక విషయాలను దాటవేస్తున్నారని అన్నారు. చైనా పౌరుడితో మంత్రి తరచూ మట్లాడారని దీనికి సంబంధించి దర్యాప్తు చేయాలని ఈడీని కోరతానని చెప్పారు. ఆయన పొలం, ఇల్లు రూ.4 కోట్లకే అమ్ముతానంటే కొంటానని పేర్కొన్నారు. మంత్రి భూమి వరకు మూడు కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు వేశారని ఆరోపించారు. చైనాకు చెందిన మో అనే వ్యక్తితో మంత్రి నిరంజన్ రెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. వేరే దేశపు వ్యక్తికి మంత్రి ఎందుకు అనిసార్లు ఫోన్ కాల్స్ చేశారని అడిగారు.
Read Also: అమిత్ షా దేశానికి హోంమంత్రి.. ఒక వర్గానికి కాదు: షబ్బీర్ అలీ
Follow us on: Google News, Koo, Twitter