తెలంగాణ ప్రభుత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) విమర్శలు చేశారు. శుక్రవారం వీపీజీ గ్రౌండ్స్‌లో వార్డ్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజసింగ్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డ్ ఆఫీసుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం షో చేస్తోందని ఎద్దేవా చేశారు. పది రోజుల తర్వాత వార్డ్ ఆఫీసుల్లో ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. కార్మికుల కొరత వలన గోషామహల్ నియోజకవర్గంలో రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని విమర్శించారు. కార్మికుల సంఖ్యను పెంచకుంటే శానిటేషన్ సమస్య ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. సిటీలో మంత్రులు తలసాని, మహమూద్ అలీలు శానిటేషన్ సమస్యపై దృష్టి పెట్టాలని తెలిపారు.
Read Also:
1. దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ
2. ‘2019లో జగన్‌ను గెలిపించటం ప్రజలు చేసిన తప్పే’
Follow us on: Google News, Koo, Twitter, ShareChat