బీజేపీ బహిష్కృత నేత, గోషామహాల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్(Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవాం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర నియోజకవర్గాల ముస్లిం ఓటర్లను గోషామహల్‌లో చేర్చుకొని బీఆర్ఎస్ నాయకులు తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ధూల్‌పేట్, బేగంబజార్, గన్‌ఫౌండ్రీ, జాంబాగ్ తదితర ప్రాంతాల్లో ఈ ఎన్‌రోల్‌మెంట్‌లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లు సెప్టెంబర్ 2,3 తేదీల్లో బూత్‌కు వచ్చి ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు.
18 ఏళ్లు నిండిన వారు కూడా కొత్త ఓటరు ఐడీ కోసం నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. రాజాసింగ్(Raja Singh) సస్పెన్షన్‌ను బీజేపీ ఇంకా ఉపసంహరించుకోలేదు. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజాసింగ్ నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, బీజేపీ మాత్రం ఆయన సస్పెన్షన్‌ను ఇంకా ఉపసంహరించుకోలేదు. కాగా, ఇటీవల తాను గోషామహల్ నియోజకవర్గం నుంచి కాషాయ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.