Bandi Sanjay |ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు స్పీడు పెంచాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి జనాలకు దగ్గరవడానికి ప్రయత్నం చేస్తుండగా.. బీజేపీ నేతలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తూ దూకుడు పెంచాడు. తాజాగా.. ఎన్నికలే లక్ష్యంగా, అమలు చేయాల్సిన వ్యూహాలకు సంబంధించి సోమవారం చంపాపేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత నేతలపై బండి సంజయ్(Bandi Sanjay) సీరియస్ అయ్యారు. నేతలు కట్టు దాటితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పార్టీ టికెట్లపై నేతలకు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. టికెట్లు కావాలంటే ప్రజల మధ్య ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో టచ్‌లో ఉండే వారికి సర్వేల ఆధారంగా టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. నేతలు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే చర్యలు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు. షోపుటాప్ చేస్తే టికెట్లు రావని విషయాన్ని నాయకులు గుర్తుంచుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లేది అప్పుడే.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter