Eatala Rajender | మునుగోడులోనూ బీజేపీనే గెలిచింది.. ఈటల కీలక వ్యాఖ్యలు

-

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పార్టీపై కొన్ని మీడియా ఛానళ్లు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) ఒక్కటయ్యారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ చాలా బలంగా ఉందని.. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోందని చెప్పారు. ఠక్కున పైకి వెళ్లి పోవడానికి.. రాజకీయాలేమీ సెన్సెక్స్ కాదని అన్నారు. తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019 ఎంపీ ఎన్నికలతో మొదలైందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటామని చెప్పారు. మునుగోడు(Munugode)లోనూ నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు. కేసీఆర్(KCR) కుటుంబ పాలనను ఒదిలే ప్రసక్తే లేదన్న ఈటల(Eatala Rajender).. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని పరోక్షంగా హెచ్చరించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చినా రాష్ట్రం రైతులకు ఇచ్చే పరిస్తితి లేదని విమర్శించారు. పార్టీ యంత్రాంగమంతా వరంగల్ ప్రధాని సభను విజయవంతం చేస్తుందన్నారు.

- Advertisement -
Read Also:
1. పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందే.. రేవంత్ పిలుపు
2. ఇవి తింటే ఉన్న వయసుకంటే 10 ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...