KCR | కేంద్రమంత్రి చాలాసార్లు బెదిరించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ భవన్ లో మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రముఖులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబి(KRMB)కి అప్పగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ… కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13 న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

- Advertisement -


కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని అన్నారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమ కారులదేనని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు. కేఆర్ఎంబి కి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగాఖండిస్తున్నామని, ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని బీఆర్ఎస్ అధినేత అన్నారు.


కేఆర్ఎంబి పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పి కొట్టిందన్నారు. ప్రాజెక్టులను అప్పగించాలని కేంద్రమంత్రి షెకావత్ నన్ను ఎన్నోసార్లు బెదిరించారు. అవసరమైతే ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం కానీ ప్రాజెక్టులను అప్పగించమని తేల్చి చెప్పామన్నారు. కేంద్రం ఒత్తిళ్ళను తట్టుకుంటూ పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి ప్రాజెక్టులను కాపాడిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడుతామన్నారు.


కృష్ణా నది పై ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి అప్పగించడం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కృష్ణా ప్రాజెక్టులు నదీ జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు.. రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేఖ వైఖరిపై చేపట్టవలసిన తదుపరి కార్యాచరణ పై నేతలకు కేసీఆర్(KCR) దిశానిర్దేశం చేసారు. కాగా, ఈ సమావేశం లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జి జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పి చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ మున్సిపల్ చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు… తదితరులు భారీగా పాల్గొన్నారు.


Read Also: తాపీ మేస్త్రీ కావలెను.. జీతం రూ.4లక్షలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...