బీఆర్ఎస్(BRS), కమ్యూనిస్టుల(CPI) పొత్తు విషయం ఇంకా అయోమయంలోనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కమ్యూనిస్టుల పొత్తు గురించి బీఆర్ఎస్ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao) పొత్తుల విషయమై ఇవాళ ఓ ప్రముఖ చానల్‌తో మాట్లాడారు. పొత్తు బాల్ బీఆర్ఎస్ కోర్టులో ఉందని, నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే అని తెలిపారు. బీఆర్ఎస్(BRS) లిస్ట్ అంటున్నారని, ఆ లిస్ట్ తర్వాత ఆ పార్టీతో పొత్తుపై తమ వైఖరి ఏంటో స్పష్టం చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబు వామపక్ష పార్టీలను గౌరవించే వాళ్లని అన్నారు. ‘ముగుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు కావాలని బీఆర్ఎస్ వాళ్లే మా దగ్గరకు వచ్చారని, మేం వెళ్లి ఇస్తాం అనలేదు’ అని వెల్లడించారు.