Malla Reddy | ‘మల్లారెడ్డి’నా మజాకా.. అసెంబ్లీలో నవ్వులే నవ్వులు..

-

మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) ఏం మాట్లాడినా వెరైటీగానే ఉంటుంది. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. మంత్రినయ్యా అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా నది జలాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. సభ మొత్తం హాట్‌హాట్‌గా ఉన్న సమయంలో మల్లారెడ్డి.. మైక్ అందుకుని స్పీకర్‌కు ఓ రిక్వెస్ట్ చేయాలంటూ మాట్లాడారు. దీంతో సభాపతి మైక్ ఇచ్చారు.

- Advertisement -

అంతే మల్లారెడ్డి(Malla Reddy) సీరియస్‌గా లేచి.. “ఈనెల 14, 15 తేదీల్లో వసంత పంచమి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 26వేల పెళ్లిళ్లు ఉన్నాయి కాబట్టి సభ్యులందరి కోరిక మేరకు ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని స్పీకర్‌కు నా రిక్వెస్ట్” అంటూ తెలిపారు. అంతే సభలో స్పీకర్‌తో పాటు సభ్యులందరి ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో మల్లన్న ఏం మాట్లాడినా వెరైటీనే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం.. రేవంత్ వర్సెస్ హరీష్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...