Maharashtra | మహారాష్ట్రలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు జోగు రామన్న(Jogu Ramanna), కోనప్ప(Konappa) ప్రయాణిస్తున్న వాహనానికి ఓ పశువు అడ్డు వచ్చింది. దీంతో దానిని తప్పించబోయి ఎమ్మెల్యేల వాహనం డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా డ్యామేజ్ కాగా.. ఎమ్మెల్యేలు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో మాజీ ఎంపీ నగేష్ కూడా ఉన్నట్లు సమాచారం. నాగపూర్ వెళ్తుండగా పాండ్రా కొడ బోరీ మధ్య ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేలను వేరే వాహనంలోకి మార్చి ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.