Cbi notices to trs mlc kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

-

Cbi notices to trs mlc kavitha in delhi liquor scam case: తెలంగాణ నేత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారి చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ఈడీ కస్టడీలో ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌‌లో కవిత పేరు చేర్చారు. ఈ నేపథ్యంలో 160 సీఆర్పీసీ కింద ఢిల్లీ సీబీఐ ఆఫీస్ నుంచి కవితకు నోటీసులు సీబీఐ నోటసులు జారీ చేసింది. ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో ఎక్కడైనా విచారణకు హాజరుకావొచ్చని సీబీఐ పేర్కొంది. (Cbi notices to trs mlc kavitha)

- Advertisement -

కాగా.. ఈ నెల 6న హైదరాబాద్‌లో కవిత విచారణకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. కాగా.. దీనిపై స్పందించిన కవిత ఎలాంటి విచారణకైనా సిద్ధమని, జైలుకు పంపించినా భయపడనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే.. విజయ్ నాయర్‌‌‌కు సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అందాయని, సౌత్ గ్రూప్‌‌లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ పేర్కొంది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని, ఆ 10 ఫోన్ల ఐఎమ్ఈఐ నెంబర్లను అమిత్ అరోరా 32 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ప్రస్తావించారు. కాగా.. 2021 సెప్టెంబరు 1వ తేదీన ఒకేరోజు ఎమ్మెల్సీ కవిత, బోయినపల్లి అభిషేక్​ రావు, సీఏ బుచ్చిబాబు ఫోన్లు మార్చినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...