నాంపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్(Charminar Express) స్టేషన్‌లో ఆగే సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో ఫ్లాట్‌ఫాం సైడ్‌గోడలకు రాసుకుంటూ డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టింది. అయితే రైలు నెమ్మదిగా వెళ్తున్నందును పెద్ద ప్రమాదమేమి జరగలేదు. అయితే కొంతమంది ప్రయాణికులకు మాత్రం స్వల్పగాయాలయ్యాయి. మరికొంతమందికి భయంతో గుండెపోటు రావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదం(Charminar Express)పై దక్షిణ మధ్య రైల్వే స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అయితే కొంతమంది ప్రయాణికులకు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపింది. నాంపల్లి(Nampally) చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని స్పష్టంచేసింది. అలాగే ఈ ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పందిస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Read Also: టైఫాయిడ్ జ్వరం వెంటనే తగ్గడానికి చిట్కా
Follow us on: Google News, Koo, Twitter, ShareChat