Chocolate stuck in throat 8 year old child died: పిల్లల మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు చాక్లెట్లు కొనిపెట్టడం సహజం. కానీ ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డకు ఎంతో ప్రేమగా కొనిచ్చిన చాక్లెట్ బిడ్డ ప్రాణం తీస్తుందని ఊహించరు. తండ్రి విదేశాల నుంచి తెచ్చిన చాక్లెట్‌లను తీసుకుని చిన్నారి స్కూల్‌లో తినడానికి తీసుకుని వెళ్లాడు. కానీ ఆ చాక్లెట్ ఆ చిన్నరికి యమపాశంగా మారింది. అది తిన్న ఆ చిన్నారికి ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. విరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన కన్‌గహాన్ సింగ్ వరంగల్‌కి 20 ఏళ్ల క్రితం వలస వచ్చి స్థిరపడ్డాడు. సింగ్‌కి భార్య గీత, ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. వీరితో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు లైన్‌లో నివాసం ఉంటున్నాడు.
కాగా.. వ్యాపార కార్యకలాపాల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సింగ్.. పిల్లల కోసం చాక్లెట్లను తెచ్చాడు. అయితే కన్‌గహాన్ రెండో కుమారుడు సందీప్(8) వరంగల్ పిన్నావారి వీధిలోని శారదా పబ్లిక్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. సందిప్‌ని తన తండ్రి స్కూల్‌కి తీసుకువెళ్లే ముందు తల్లి చాక్లెట్లు ఇచ్చింది. ఆ చాక్లెట్ నోట్లో పెట్టుకుని స్కూల్‌కి వెళ్లిన సందిప్ క్లాస్ రూంలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు హుటాహుటిన తండ్రి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు సందీప్ గొంతులో చాక్లెట్ ఇరుక్కున్నట్లు (Chocolate stuck in throat) గుర్తించి.. చికిత్స అందిస్తుండగానే ఊపిరాడక చనిపోయాడు