రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తన నిరాహార దీక్ష తర్వాతే ఉద్యమం ఓ కొత్త మలుపు తీసుకుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లు తలచుకోవాలని, ఆనాటి ఉద్యమనేత ఆమోస్‌ను అప్పటి ప్రభుత్వం వేధించిందని కేసీఆర్ ఆరోపించారు. నాపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏ నేతపైనా జరిగి వుండదని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అంటే ఉద్యమం నడిపానని ఆయన గుర్తుచేశారు. నా నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చిందని.. పార్లమెంట్‌లోనే పెప్పర్ స్ప్రే చల్లే స్థాయికి వెళ్లారని కేసీఆర్ తెలిపారు. ఆ సమయంలో విద్యార్థుల ఆత్మహత్యలు తనను కలచివేశాయని.. అమరవీరుల స్థూపం నిర్మాణంలో కొంత జాప్యం జరిగిందని కేసీఆర్(CM KCR) అంగీకరించారు. అత్యుత్తమంగా నిర్మించాలనుకున్నందునే కొంత జాప్యం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల వారు వస్తే ముందుగా అమరవీరులకు నివాళి అర్పించాలని ఆయన కోరారు.
Read Also:
1. కేసీఆర్‌ను బాటా చెప్పుతో కొట్టాలి.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
2. ‘9 ఏళ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేళ మళ్లీ పుట్టుకొచ్చింది’
Follow us on: Google News, Koo, Twitter, ShareChat