తెలంగాణ రైతులకు(Telangana Farmers) ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో రైతుల లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలోని ఏదైనా బ్యాంక్ నుంచి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు(Crop Loans) పొంది ఉన్న రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం మిగిలిన అందరికీ సోమవారం నుంచి రుణమాఫీని దశల వారీగా వర్తింపజేయనున్నారు.
రైతుబంధు(Rythu Bandhu) తరహాలోనే చిన్న రైతుల నుంచి మొదలుకుని పెద్ద రైతుల వరకు, రూ.37వేల నుంచి మొదలు లక్ష వరకు రుణం తీసుకున్న రైతులకు దీన్ని అమలు చేయనున్నారు. సెప్టెంబర్ రెండో వారం నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఒక లక్ష రూపాయల వరకు తీసుకున్న రైతులకు సైతం ఈరోజు (సోమవారం) నుండి రైతుల(Telangana Farmers) ఖాతాలో జమ చేస్తున్నారు .ఇందులో భాగంగా ఈ రోజు (సోమవారం) రైతుల ఖాతాల్లో జమచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.