తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సిద్ధిపేట జిల్లా కోనాయిపల్లి(Konaipally Temple) వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. ప్రతి ఎన్నికలకు ముందు ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో గుడికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో కేసీఆర్‌కు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకన్న సన్నిదిలో నామినేషన్ పత్రాలపై కేసీఆర్ సంతకాలు చేశారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు, అధికారులు ఉన్నారు.
కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌కు గెలుపొందుతూ వస్తున్నారు. 1985 నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలోనే నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు. కాగా ఈ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న విషయం విధితమే. ఈ నెల 9న ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో కేసీఆర్(CM KCR) నామినేషన్ వేయనున్నారు.