షర్మిల కాంగ్రెస్‌కు మద్దతుపై.. సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

-

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైసీటీపీ అధినేత షర్మిల(YS Sharmila) మద్దతు ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల తెలంగాణలో ఓ పార్టీకి అధ్యక్షురాలు.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమన్నారు. అయితే జగన్ రెడ్డిని ఏ పార్టీ అయితే అక్రమ కేసులు పెట్టి వేధించిందో ఆ పార్టీతో షర్మిల కలవడాన్ని ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించి ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసన్నారు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. తమకు మాత్రం ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమని.. పక్క రాష్ట్రాలతో సంబంధం లేదన్నారు.

- Advertisement -

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై వరుస కేసులు పెట్టడంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణపలపై సజ్జల తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుపై ఎందుకు తక్కువ కేసులు పెట్టారని అడగాలన్నారు. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారని ఆరోపించారు. చట్టానికి విరుద్ధంగా చేశారు కనుకే చట్ట ప్రకారం కేసు పెట్టారని స్పష్టంచేశారు. చంద్రబాబు చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయని.. ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసులు పెట్టారన్నారు. ఉచిత ఇసుక అంటే ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలి కానీ పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు పెట్టి దందా చేశారని ఆయన ధ్వజమెత్తారు .

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కేవలం చంద్రబాబు కుటుంబానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని.. వారం పది రోజుల నుంచే ఇలా మాట్లాడుతున్నారని సజ్జల( Sajjala Ramakrishna Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా? టీడీపీకి ఉపాధ్యక్షురాలా? అని ప్రశ్నించారు.

Read Also: తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరం.. నన్ను క్షమించండి: షర్మిల
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

స్వీట్స్ తినకుండా ఉండలేకపోతున్నారా.. ఈ వార్త మీకోసమే..

Eat Sweets | స్వీట్స్ అందరికీ నచ్చేవి.. ఊరించేవి. ఆ తర్వాత...

గవర్నర్ హరిబాబును ఐసీయూకి షిఫ్ట్ చేసిన వైద్యులు..

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు(Kambhampati Haribabu) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను...