హైదరాబాద్‌లో స్థిరపడ్డ కర్ణాటక ప్రజలకు సీఎం కేసీఆర్(CM KCR ) శుభవార్త చెప్పారు. కన్నడిగుల కోసం హైద్రాబాద్‌లో ఉన్నటువంటి సాహిత్య వేదికను పునరుద్ధరించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాగా, అంబర్‌పేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరిక మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో స్థిర నివాసం ఏర్పరుచుకుని జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారిని సమానంగా ఆదరిస్తుందని అన్నారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కమ్యునిటీ అవసరాల కోసం వినియోగించుకునే విధంగా రూ.5 కోట్లు మంజూరు చేశారు.