సచివాలయాన్ని ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్ననని సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. తెలంగాణ సచివాలయం(New Secretariat) అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గొప్ప పోరాటం తర్వాత తెలంగాణ కల సాకారమైందన్నారు. సమైక్య పాలనలో నీళ్లు ఎలా వస్తాయని ఆనాడు పాలకులు ప్రశ్నించారన్నారు. కానీ వాటిని ఛేదించి తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రభుత్వాధికారులకు చెతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. తెలంగాణ సచివాలయం లాగే రాష్ట్రంలోని పల్లెలు వెలుగుతున్నాయన్నారు.
సమాన హక్కుల కోసం ఉద్యమించాలని బోధించు, సమీకరించు, పోరాడు అనే సందేశాన్ని ఇచ్చిన అంబేద్కర్ చూపిన బాటలో తెలంగాణ పోరాటం సాగిందన్నారు. అంబేడ్కర్(Ambedkar) సూచించిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేందుకే అంబేడ్కర్ పేరు సచివాలయానికి పెట్టామన్నారు. పునర్నిర్మాణ కాంక్షను కొంత మంది హేళన చేస్తున్నారన్నారు. సమైక్య పాలనలో చిక్కి పోయిన తెలంగాణను చెరువులు నింపి నిర్మించుకున్నామన్నారు. అన్ని జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ లు కట్టామని అదే పునర్నిర్మాణమన్నారు. రైతుల దర్పమే తెలంగాణ పునర్మిణమన్నారు. కొందరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్(CM KCR) మండిపడ్డారు.
Read Also: తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
Follow us on: Google News, Koo, Twitter