దాదాపు ఆరు నెలల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) ఢిల్లీ టూర్ ఖరారు అయింది. బుధవారం సాయంత్రం 4గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. కేసీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు ఢిల్లీలోని వసంత్ విహార్‌లో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ(Delhi BRS Party Office) ఆఫీస్‌ను కేసీఆర్ ప్రారంభించనున్నారు. తొలుత హోమం, వాస్తు పూజలు నిర్వహించిన తర్వాత నిర్ణీత ముహూర్తం ప్రకారం 1.05 గంటలకు బీఆర్ఎస్ ఆఫీస్‌ను ప్రారంభిస్తారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మొత్తం 1,150 చదరపు మీటర్ల స్థలంలో ఐదు అంతస్తులలో ఈ భవనాన్ని నిర్మించారు. మొత్తం 18 రూమ్‌లతో పాటు సమావేశాల కోసం ఓ కాన్పరెన్స్ హాల్ కూడా ఏర్పాటుచేశారు. కాగా దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్(CM KCR) ఇకపై ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీస్ కేంద్రంగానే రాజకీయాలు చేయనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో మూడు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Read Also: జీతం ఇవ్వట్లేదని మంత్రిని కాల్చి చంపిన అంగరక్షకుడు
Follow us on: Google News, Koo, Twitter