డిజిటల్ హెల్త్ కార్డుల(Digital Health Cards) విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కార్డుల పంపిణీ సమయంలో కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే కుటుంబం మొత్తం ఫొటో తీయాలని సూచించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని చెప్పారు. డిజిటల్ కార్డులపై ఈరోజు సీఎం సమీక్షించారు. ఈ క్రమంలోనే ఈ కార్డుల కోసం సేకరించే వివరాలను అధికారులు.. సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన కీలక సూచనలు చేశారు.
డిజిటల్ హెల్త్ కార్డుల(Digital Health Cards) పంపిణీని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు. ఇది అక్టోబర్ 3 నుంచి 7 వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు. కొత్త సభ్యలకు జత చేసి, చనిపోయిన వారిని తొలగించాల్సి ఉంది. పైలెట్ ప్రాజెక్టులో ఎదరైనా సమస్యలతో నివేదిక తయారు చేయాల్సి ఉంది. కుటుంబ సభ్యుల వివరాల మార్పులు చేర్పుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు.