బీఆర్ఎస్ సర్కార్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని తెలిపారు. ఎన్నికలు రాగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని పేర్కొన్నారు. ఎంఐఎంని పెంచి పోషిస్తోంది సీఎం కేసీఆరేనని దుయ్యబట్టారు. నేరస్తులకు షెల్టర్‌గా ఓల్డ్‌సిటీ మారిందని బండి సంజయ్ ఆరోపించారు.
దేశ వారసత్వ సంపదను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మమ్మీ, డాడీ సంస్కృతి పోవాలని అన్నారు. తెలంగాణ ప్రజలను బట్టలిప్పి బతకమ్మలాడించిన నిజాం రాజు సమాధి వద్ద మోకరిల్లే పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని అలాంటి పార్టీలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. అలాంటి పార్టీలను తరిమికొట్టి బుద్ధి చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకుపోతున్నదని బండి సంజయ్(Bandi Sanjay) చెప్పారు. దేశభక్తి, సంస్కృతి సాంప్రదాయాలతో పాటు యువతలోని నైపుణ్యాలను వెలికితీసి దేశాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాని ఎంతో కష్టపడుతున్నారని అన్నారు.
Read Also: హోలీ రోజు ఏ రంగులు చల్లుకుంటే మంచిదో తెలుసా
Follow us on: Google News