Congress CPI Alliance | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎట్టకేలకు సీపీఐ-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయానికి వెళ్లి కూనంనేని సాంబ శివరావు, చాడ వెంకటరెడ్డిలతో జరిపిన చర్చలు ఫలించాయి. పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ స్థానం, ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని రేవంత్ ఇచ్చిన హామీకి సీపీఐ అంగీకారం తెలిపింది.
Congress CPI Alliance | సీపీఐకి కొత్తగూడెంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి గెలుపునకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీపీఎంతోనూ పొత్తు అంశంపై చర్చలు జరుగుతున్నాయని ఆ పార్టీ తమతో కలిసివస్తుందనే నమ్మకం తనకు ఉందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల ఓట్లు గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.