తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం ఝార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌తో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయి గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించే వరకు తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ కొనసాగుతారు.
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ 1998, 1999లో కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2023 ఫిబ్రవరి 12న ఝార్ఖండ్ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
కాగా గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్.. సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నియోజకవ్గరం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది.