వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) స్పందించారు. దీనిపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌కు తాము వ్యతిరేకమని నారాయణ స్పష్టం చేశారు. మోడీ నియంతృత్వ పోకడ దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం అక్కర్లేదు.. నా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే భారత్‌లో సరికాదని మండిపడ్డారు. జమిలి ఎన్నికలపై చర్చ పార్లమెంట్‌లో జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం చూస్తోందని నారాయణ అనుమానం వ్యక్తం చేశారు.
ఇండియా కూటమిని చూసి మోడీ(Modi) భయపడుతున్నాడని అన్నారు. దేశంలో దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో మోడీ ఘనుడని విమర్శించారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అని లీక్ ఇచ్చారని అన్నారు. వన్ నేషన్, వన్ పార్టీ, వన్ పర్సన్.. ఆర్ఎస్ఎస్ అన్నట్లుగా కేంద్ర వైఖరి ఉందన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాలని ఆయన(CPI Narayana) తెలిపారు.