జాతీయ పార్టీ హోదా కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ(CPI) నేతలకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. తెలంగాణలో గుర్తింపు పొందిన పార్టీగానే పరిణిస్తామని స్పష్టం చేసింది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం సీపీఐ(CPI) ఇంతకాలం ఒక జాతీయ పార్టీగా కొనసాగినా ఇటీవల కొన్ని ప్రమాణాల మేరకు ఆ అర్హతను కోల్పోయిందంటూ నేషనల్ పార్టీ స్టేటస్‌ను తొలగించింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న స్టేటస్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్టడీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఓటింగ్ శాతం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికీ రాష్ట్రంలో స్టేట్ పార్టీగా గుర్తింపును కొనసాగించుకోవచ్చని స్పష్టత ఇచ్చింది. అంతేగాక, కంకీ కొడవలి గుర్తుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, కామన్ ఎలక్షన్ సింబల్‌గా ఇంతకాలం వాడుకున్న చిహ్నాన్నే కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి అశోక్‌కుమార్ స్పష్టం చేశారు.
Read Also: కనీసం చనిపోయిన వ్యక్తి శవాన్ని కూడా చూపించరా?: RSP
Follow us on: Google News, Koo, Twitter