DAV school గుర్తింపు తక్షణమే రద్దు : మంత్రి సబితా

-

DAV school: ఎల్‌కేజీ బాలికపై లైంగిక వేధింపులకు కారణమైన బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ (DAV school) గుర్తింపును తక్షణమే రద్దు చేయాని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ స్కూల్‌‌లో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. పక్కనే ఉన్న స్కూల్స్‌‌లో సర్ధుబాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జగ్రత్తలు తీసుకోవాలని దీనికోసం విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ కమిటీలో పాఠశాల విద్యా శాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని ఆమె ప్రకటించారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని.. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంభందించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

- Advertisement -

Read also: పులికి.. పిల్లికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతావు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...