కేసీఆర్‌కు దమ్ముంటే నాపై పోటీ చేయాలి: ధర్మపురి అరవింద్

-

సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే నిజామాబాద్‌లో ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) సవాల్ చేశారు. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తామన్నారు. కేటీఆర్ ఎలిజిబిలిటీ కేవలం కేసీఆర్ కొడుకు మాత్రమేనని.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే కనీసం కుటుంబంలో గౌరవం కూడా దక్కదని తెలిపారు. కేటీఆర్(KTR) నిజామాబాద్‌లో మోసపూరిత వాగ్ధానాలు చేశారని విమర్శించారు. కేటీఆర్‌కు కులపిచ్చి ఉందని.. ల్యాండ్ సెటిల్ మెంట్స్ కోసమే కుల అహంకారంతో రిటైర్ అయిన ఆరుగురు అధికారులను తిరిగి పోస్టింగ్‌లు ఇచ్చారని ఆరోపించారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అరవింద్ హెచ్చరించారు.

- Advertisement -

కల్వకుంట్ల కుటుంబానికి సంస్కారం నేర్పిన వారిలో తాను ఒకడినని తెలిపారు. తొలుత గృహలక్ష్మి పథకం కింద రూ.5 నుంచి 6 లక్షలు ఇస్తామన్నారని.. కానీ ఇప్పుడు రూ.3 లక్షలకు కుదించారని వెల్లడించారు. గృహలక్ష్మి పథకం(Gruhalakshmi Scheme) కింద రూ.12 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కేటీఆర్ ఇంటికి వస్తానని 2022-23 బడ్జెట్‌పై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. గృహలక్ష్మికి డబ్బులు విడుదల చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. మద్యం టెండర్లకు 15 రోజుల టైం ఇచ్చారని, గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం 3 రోజుల సమయం ఇస్తారా అని అరవిద్ ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌లను నమ్మడం లేదన్నారు.

మరోవైపు బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao)పైనా కౌంటర్లు వేశారు. ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ నామా చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు అరవింద్‌(Dharmapuri Arvind). నాగేశ్వరరావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. గతంలో కేటీఆర్‌ గుజరాత్‌లో ఇంటింటికి నీళ్లు ఎలా ఇస్తున్నారన్నదానిపై స్టడీ చేశారని.. ప్రముఖ వార్తపత్రికల్లో కూడా ఈ విషయం వచ్చిందన్నారు. మీ వయసుకు అబద్ధాలు తగవని.. గులాబీ కండువా కప్పుకున్న తర్వాతే నామా ఇలా తయారయ్యారంటూ చురకలంటించారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదంటూ హితవు పలికారు.

Read Also: పవర్ స్టార్ ‘OG’ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు కన్ఫామ్!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...