ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై బీజేపీ కీలక నేత డీకే అరుణ(DK Aruna) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అసలు వరదలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. వాతావరణ శాఖ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. స్థానిక పరిస్థితులను పరీశించిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులెత్తేశారని మండిపడ్డారు.
గతంలో వరదలొస్తే రూ.10 వేలు ఇస్తామని ప్రకటించి ఇప్పుడెందుకు ఇవ్వడం లేదని ఆమె(DK Aruna) ప్రశ్నించారు. హైదరాబాద్ మహా నగరాన్ని డల్లాస్ చేస్తామని ఖల్లాస్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని అన్నారు. కాగా, గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షం పడింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది.